- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని.. హైదరాబాద్, తెలంగాణలో అలాంటి పరిస్థితి రావొద్దని ఈవీ పాలసీ తెచ్చామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పొల్యూషన్ తగ్గించాలంటే ఈవీ వాహనాలను వాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రజలకు పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందని.. ఈవీ వాహనాలపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. వాయు కాలుష్యం రావొద్దంటే 15 సంవత్సరాలకు పైబడిన వాహనాలను ప్రజలు స్వచ్ఛందంగా స్క్రాప్ చేయాలని.. ఇప్పటికే రాష్ట్రంలో స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి తెలిపారు.
- Advertisement -