Thursday, January 23, 2025

పార్టీ మారుతున్నానన్నది దుశ్ప్రచారం మాత్రమే : పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. పార్టీలోనే రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితగా వ్యహరిస్తు ఏ కమిటీ లో చోటు కలిగించకపోగా పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ దుశ్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి ఎన్‌ఎస్‌యుఐ లో సాధారణ కార్యకర్తగా పని చేస్తూ ఎన్‌ఎస్‌యుఐ కళాశాల ప్రెసిడెంట్ నుండి అంచలంచలుగా ఎదుగుతూ ఉమ్మడి రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడుగా ఎన్‌ఎస్‌యుఐని బలోపేతం చేశానని తెలిపారు. యువజన కాంగ్రెస్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ కోసం 35 ఏళ్ళు గా ఎంతో కృషి చేస్తూ మార్కెఫెడ్ చైర్మన్ గా,

కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు చేత ఎన్నో అవమానాలకు, పెప్పర్ స్ప్రే దాడికి గురై చావు అంచుల వరకూ వెళ్ళానన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమకారుడని, బడుగుబలహిన వర్గాల నేతని,నిత్యం తెలంగాణ ప్రజల కోసం, పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నానన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పై ఎప్పటికి అపుడు నిలదీస్తూ ప్రజల తరఫున గొంతుక వినిపిస్తున్నానని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్రంలో పార్టీని తిరిగి అధికారం లోకి తీసుకు రావడానికి కృషి చేస్తానని, ఈనెల 30న కొల్లాపూర్ లో జరిగే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పాల్గొనే సభలో ముఖ్య కార్యకర్తగా పాల్గొటానని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News