Wednesday, January 22, 2025

నియంతృత్వ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి: పొన్నం

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తోడు దొంగల్లా బిజెపి, బిఆర్ఎస్ లు తిరుగుతున్నాయని విమర్శించారు. పదేళ్లు సిఎంగా పనిచేసిన కెసిఆర్.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కెసిఆర్ భాషను చూసి ప్రజలే తిరుగబడతారన్నారు. అసెంబ్లీకి రాని వ్యక్తి.. జిల్లాల బాట పట్టారని మండిపడ్డారు.

లోక్ సభ ఎన్నికల్లో నియంతృత్వ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని పొన్నం అన్నారు. రాష్ట్రంలో అన్ని ఎంపి స్థానాలను కాంగ్రెస్ గెలవాలన్నారు. ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ఏర్పాటు చేశామని… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అందించబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశంలో మార్పునకు శ్రీకారం చుట్టబోతోందని మంత్రి పొన్నం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News