Thursday, April 17, 2025

మహిళలు అభివృద్ధి పథంలో ముందుకు: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంజిబిఎస్ బస్ స్టేషన్ ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిభ కనబర్చిన ఆర్టిసి ఉద్యోగులను సత్కరించారు. మహిళా దినోత్సవ సందర్భంగా ఆర్టిసి బస్సులో ప్రయాణించారు. ఎంజిబిఎస్ బస్ స్టేషన్ లో మహిళా ప్రయాణికులకు గులాబీ పూలు, స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటిస్తూ.. బస్సు ప్రయాణంలో తలెత్తుతున్న ఇబ్బందులలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక తెలంగాణ ప్రభుత్వం పక్షాన మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయని, మహిళలు అందరూ వాటిని ఉపయోగించు కొని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఇప్పటి వరకూ 150 కోట్లమంది మహిళలు ఆర్టిసిలో ఫ్రీగా ప్రయాణించారు. ఎంజిబిఎస్ నుంచి ఫలక్ నుమా వరకు బస్సులో పొన్నం ప్రభాకర్ ప్రయాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News