Tuesday, January 21, 2025

ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోండి: మంత్రి పొన్నం వార్నింగ్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జెన్ కో తోపాటు ఇతర డిపార్ట్ మెంట్ లో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారు.. వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళాలని… లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ అండ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చారించారు. బుధవారం జిల్లా పట్టణంలో మంత్రి మార్నింగ్ వాక్ చేస్తూ.. వాకర్స్ తో కలిసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరిగితే బిఆర్ఎస్ నేతల్లో దడ పుడుతుందని.. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పారు. బిఆర్ఎస్ ను కాపాడేందుకు బిజెపి నేతలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతుందని.. గ్యారెంటీ స్కీంలపై ధరఖాస్తులు స్వీకరించామని.. చిత్తశుద్ధితో వందశాతం అమలు చేస్తామని తెలిపారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ అంత సచ్చీలుడైతే.. తనపై వచ్చిన ఆరోపణపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. భూ అక్రమాలపై చర్యలు చేపడుతామని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News