సిద్దిపేట: హుస్నాబాద్‌లో తాగునీటి కోసం రూ.5 కోట్లు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు. గౌరవెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందించాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 90 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్తున్న ప్రభుత్వం తమది అని పేర్కొన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులను అడిగి వారి సమస్యలను పొన్నం అడిగి తెలుసుకోవడం జరిగింది. తమకు కాంపౌండ్ వాల్ తో పాటు, త్రాగునీరు, వీధి దీపాలు సమస్యలను ఉన్నాయని మంత్రి దృష్టికి విద్యార్థులు తీసుకొచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనం పూర్తయినప్పటికీ కాలేజీ ఎందుకు అందులోకి షిఫ్ట్ చేయలేదని అడిగారు. రేపే కాలేజీని డిగ్రీ కాలేజీ నూతన భవనం లోకి షిఫ్ట్ చేయాలని అధికారులకు, ప్రిన్సిపల్ కి ఆదేశాలు జారీ చేశారు. నూతన భవనంలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అనివేటి మండపం శంఖుస్థాపన చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి
అనంతరం ఆలయ ప్రాంగణంలో అనివేటి మండపం శంఖుస్థాపన శిలన్యాస భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
- Advertisement -