Thursday, January 23, 2025

ఆర్టీసి బస్సులో ప్రయాణించిన పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

షాద్ నగర్ వరకు నిలబడే ప్రయాణం

మహిళా ప్రయాణికులతో పంచుకున్న ఉచిత ప్రయాణం విశేషాలు

బస్సులో ప్రయాణించిన మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే శంకర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసి బస్సులో ప్రయాణించారు. ఆదివారం పాలమూరు జిల్లాలో గౌడ సంఘ సమావేశానికి రానున్న సందర్భంగా ఆయన హైదరాబాద్ నుండి షాద్ నగర్ వరకు ఆర్టిసి బస్సులో ప్రయాణించారు. నారాయణపేట డిపోకు చెందిన బస్సులో ఆయన బస్సులోని ప్రయాణికులతో మాట్లాడారు. బస్సులో ఆయన కూర్చోకుండా నిల్చుండే ప్రయాణికులతో ఉచిత ప్రయాణం గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళ ప్రయాణికులతో వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకోవడంతో పాటు ఉచిత ప్రయాణం ఎలా ఉందని అందరిని ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం పట్ల మహిళా ప్రయాణికులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడంతో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని మంత్రి ప్రభాకర్ చెప్పారు. షాద్ నగర్ శివారులో హోటల్ 44 దాబా వద్ద ఆయన బస్సు దిగారు. బస్సు దిగగానే ఆయనకు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాం సుందర్ రెడ్డి, మాజీ ఎంపిపి శివశంకర్ గౌడ్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బస్సు ప్రయాణం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మిత్రులతో తన అనుభవాలను పంచుకున్నారు. మంత్రి బస్సు ప్రయాణాన్ని పలువురు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News