Thursday, December 26, 2024

బిఆర్ఎస్ పాలనలో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు: పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హంతకులే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని కెటిఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ చురకలు అంటించారు. సర్పంచ్ పెండింగ్ బిల్లులపై మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బిఆర్‌ఎస్ పాలనలో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. సర్పంచ్‌లను పనుల పేరుతో వేధించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఆత్మీయ సమ్మేళనాలతో రాజకీయం చేస్తున్నారా? అని పొన్నం దుమ్మెత్తిపోశారు. బిఆర్‌ఎస్ హయాంలో రూ.1100 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. బిఆర్‌ఎస్ వాళ్లను ఎవరూ నమ్మరు కెటిఆర్ అని మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News