Saturday, December 21, 2024

ఆవేశం స్టార్ పొన్నం ప్రభాకర్: పాడి కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎంఎల్ఎ దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని మరోసారి స్పీకర్ ను కోరుతున్నామని ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన బిఆర్ఎస్ భవనం నుంచి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లేసి మమ్మల్ని ప్రజలు గెలిపించారని, అటువంటి మమ్మల్ని అధికార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయొద్దని ఎలా అంటారని ప్రశ్నించారు. ఆర్డిఓకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, సిఎస్ కి కంప్లైంట్ చేశానని మంత్రి అంటున్నారని, ప్రమాణానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న మంత్రిని ఎందుకు బర్త్ రఫ్ చేయడం లేదని అడిగారు. పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే ఆవేశం స్టార్ అని పిలవాలని పాడి చురకలంటించారు.

ఇట్లాంటి పనులు చేస్తేనే కరీంనగర్ ప్రజలు తన్ని తరిమితే ఎక్కడికో పారిపోయారని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీల కు తోడు ఏడో గ్యారంటీ ఈ మంత్రి ఆవేశం అని ఎద్దేవా చేశారు. అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తే ఇబ్బందులు పడతారని, మంత్రి మాటలు వింటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు అవుతుందని సూచించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు శుక్రవారం కమలపూర్ లో కల్యాణ లక్ష్మీ చెక్కులు పంచారని, తులం బంగారం ఏదీ అని పాడి అడిగారు. పోలీసుల అలవెన్స్ లు, పిఆర్సిలు ములుగులో సీతక్క ఇచ్చారని, కరీంనగర్ లో ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కరీంనగర్ లో లక్ష ఓట్ల మెజార్టీతో ఎంపీ సీట్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News