Monday, January 27, 2025

‘ఇందిరమ్మ’ను హేళన చేస్తే చూస్తూ ఊర్కోం: పొన్నం

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మంత్రి పొన్నం ఫైర్

మన తెలంగాణ / హైదరాబాద్: స్వర్గీయ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హెచ్చరించారు. ఆదివారం గాంధీభవన్‌లో జాతీయపతాకావిష్కరణ అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ గృహనిర్మాణాలకు సంబంధించి కేంద్రం నిధుల మంజూరు విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వడం లేదు. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా.. ఎలా ఇవ్వరో మేము చూస్తామని ఆయన అన్నారు. ఇందిరమ్మపై అవహేళన గా మాట్లాడితే ఊరుకునేది లేదు, ఇందిరాగాంధీని నాడు అటల్ బీహారీ వాజ్‌పేయి కాళీమాతతో పోల్చిన విషయాన్ని మరువరాదన్నారు.

గత పది నెలల కాలంలో జీఏస్టీ రూపంలో రూ.37 వేల కోట్లు కేంద్రం వసూలు చేసింది, కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఎంత అని ఆయన ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహ జ్యోతి వంటి పేర్లు పథకాలకు ఎందుకు పెట్టారు, వాళ్లు ఏమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేసారా అని మంత్రి పొన్నం నిలదీశారు. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్రం నుంచి అదనంగా నిధులు ఎందుకు తీసుకురారు ? అని ప్రశ్నించారు.

కేటీఆర్‌కు కౌంటర్

కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీఆర్‌ఎస్ వాళ్లకు జీర్ణం కావడంలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పరోక్షంగా మాజీ మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. అసహనానికి కేటీఆర్ పరాకాష్ట, పథకాలకు ధరఖాస్తులు ఎందుకు అని అంటున్న కేటీఆర్ ఏ గ్రామానికి పోదామో నువ్వే డిసైడ్ చేయ్యి ఏఒక్క లబ్ధిదారుడికైనా అన్యాయం జరిగితే అప్పుడు అడుగు అని సూచించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ ఆర్దిక విధ్వంసం తర్వాత కూడా సంక్షేమ పథకాలను చిత్తశుద్దితో కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News