Saturday, December 21, 2024

రెండో రోజు ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వసూళ్లు రూ. 100 కోట్లు దాటింది!

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ దర్శకుడు మణి రత్నం తీసిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ రెండో రోజున భారత్‌లో రూ. 28.50 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 51 కోట్లు వసూలు చేసింది. రెండో రోజున గ్రాస్ కలెక్షన్ రూ. 100 కోట్లు దాటేసింది. ఓపెనింగ్ రోజునే ఈ సినిమా రూ.38 కోట్లు వసూలు చేసింది. ఓపెనింగ్ రోజున తమిళనాడులో రూ. 34.25 కోట్లు, కర్నాటకలో రూ. 7.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 5.85 కోట్లు, కేరళలో రూ. 5.10 కోట్లు వసూళ్లు రాబట్టింది. కాగా ఓవర్సీస్ కలెక్షన్ రూ. 51 కోట్లు వసూలు చేసింది.

పొన్నియిన్ సెల్వన్1 సినిమా 2022 సెప్టెంబర్ 30న విడుదలయింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 490 కోట్లు వసూలు చేసింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కల్కి కృష్ణమూర్తి రాసిన సుప్రసిద్ధ తమిళ్ నవల ఆధారంగా నిర్మించారు. ఈ సినిమాకు ఎ.ఆర్. రహ్మాన్ సంగీతాన్ని అందించారు. నటీనటులు తమ పాత్రల్లో ఇమిడిపోయారు. ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది.

ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్2 కూడా థియేటర్లకు వచ్చేసింది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్‌ది ద్విపాత్రాభినయం. నటులు విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిషా కృష్ణన్, ఆర్. శరత్ కుమార్, జయరామ్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా దూళిపాల, విక్రమ్ ప్రభు, ప్రకాశ్ రాజ్ నటనలో మెప్పించారు. విక్రమ్, ఐశ్వర్యా రాయ్ విషాదాంత ప్రేమ ఏమైందన్నది ఈ సీక్వెల్‌లో చూడాల్సిందే. సినిమాలో డ్రామా, రాజకీయాన్ని మణిరత్నం పండించారు. ‘పొన్నియిన్ సెల్వన్2’ని బెస్ట్ సీక్వెన్స్ చిత్రంగా చూడొచ్చు.

Ponniyin-Selvan-2A

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News