Friday, December 20, 2024

ఆ క్రేజీ సీక్వెల్‌లో ఐటమ్ సాంగ్

- Advertisement -
- Advertisement -

pooja hegde photos gallery

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. వరుస విజయాలు అందుకుంటూ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. క్రేజీ ఆఫర్స్‌తో ప్రస్తుతం దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరిగా వెలుగొందుతోంది. చిరంజీవి, – రామ్‌చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో పూజా ప్రత్యేక పాత్రలో నటించింది. చెర్రీకి జోడీగా నీలాంబరిగా సందడి చేయనుంది. ఇక ’రంగస్థలం’ చిత్రంలో ‘జిగేల్ రాణి’ పాటకు ఆడిపాడిన పూజా హెగ్డే ‘ఎఫ్ 3’ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందని తెలిసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’ సినిమాలో వెంకటేష్, – వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. తమన్నా, – మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తుండగా..

సోనాలి చౌహన్ స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం పూజా హెగ్డే భారీగా డిమాండ్ చేసిందట. ఫిల్మ్‌మేకర్స్ ఆమెతో చర్చించి కొంత తగ్గించి భారీ మొత్తాన్ని అందజేయడానికి ఓకే చెప్పారట. ఇకపోతే విజయ్, – పూజాహెగ్డే కాంబోలో రూపొందిన ‘బీస్ట్’ చిత్రాన్ని ఈనెల 13న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

దిల్ రాజు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఇక అమ్మడు నటించిన ’ఆచార్య’ ఈనెల 29న విడుదల కాబోతోంది. మహేష్ బాబు, – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీలో పూజా హీరోయిన్‌గా నటించనుంది. అలాగే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న ’భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలో ఈ బ్యూటీనే హీరోయిన్. ఇక బాలీవుడ్‌లో రణవీర్ సింగ్‌తో ’సర్కస్’ మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇదే క్రమంలో సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ సినిమాలో పూజా హెగ్డే నటించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News