Monday, January 20, 2025

కుమారుడి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: భర్త వివాహేతర సంబంధం కుమారుడి ప్రాణం తీసిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2019 నుంచి పూజా కుమారి అనే యువతి జితేందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. జితేందర్ కు పెళ్లై భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. తన భార్యకు విడాకులు ఇస్తానని 2019 అక్టోబర్ లో ఆర్య సమాజ్ లో పూజాను జితేందర్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయినప్పటి నుంచి పూజా ఎన్ని సార్లు అడిగిన జితేందర్ తన భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో ప్రియుడు కుమారుడు దేవాంశ్ అడ్డుగా ఉన్నాడని ప్రియురాలు భావించింది.

దేవాంశ్ ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు పూజా వెళ్లింది. దేవాంశ్ నిద్ర పోతుండగా బాలుడి గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయింది. ఇంటి బయట ఉన్న కెమెరాలతో పాటు స్థానిక ప్రాంతంలో ఉన్న కెమెరాలు గమనించగా పూజా ఇంట్లోకి వెళ్లి బయటకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకుంది. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది. తన వివాహేతర సంబంధం కుమారుడి ప్రాణాలు తీసిందని తండ్రి లబోదిబోమంటున్నాడు.

Also Read: ముగిసిన టెట్ దరఖాస్తు గడువు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News