Thursday, January 23, 2025

సూపర్ స్టార్ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో…..

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా తెలిసిందే. జనవరిలో ప్రారంభమైన షూటింగ్‌లో మహేశ్‌బాబు పాల్గొంటున్నారు. కొన్ని కీలక సన్నివేశాలని త్రివిక్రమ్ తెరకెక్కించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు షూటింగ్ సెట్ లో హెయిర్ స్టైలిష్ చేసుకుంటున్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో ద్వారా బ్యాక్ టూ షూటింగ్ అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పూజాహెగ్డే కూడా షటింగ్‌లో పాల్గొనడంతో హీరో హీరోయిన్స్ కాంబినేషన్‌లో సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలిసింది.

ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా హీరోయిన్స్‌గా నటిస్తుంది. ఈ ఇద్దరు హీరోయిన్స్‌కి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉంటుందని కొద్ది రోజుల క్రితం నిర్మాత నాగావంశీ క్లారిటీ ఇచ్చాడు. అయితే పూజా హెగ్డే పాత్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందనే తెలిసింది. దీనికి కారణం. పూజా హెగ్డే త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత, అల వైకుంఠపురంలో.. సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఆమె పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపధ్యంలో మహేశ్ సినిమాలో సరికొత్త లుక్‌లో పూజాహెగ్డే పాత్ర ఉంటుందని తెలిసింది. ఇక ఈ సినిమా కథ నేపధ్యం పల్నాడు బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని సమాచారం. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కూడా సినిమాలో ఉంటాయట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News