Monday, January 20, 2025

పాన్ ఇండియా స్టార్..

- Advertisement -
- Advertisement -

ఈ మధ్య ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా పాన్ ఇండియా అనే మాటే వినిపిస్తోంది. పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా సినిమా అనే మాటలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలంతా పాన్ ఇండియా స్టార్లే. మరి పాన్ ఇండియా హీరోయిన్ ఎవరు? అని అడిగితే మాత్రం పూజా హెగ్డే పేరే చెప్పాలేమో..? అవును.. పూజా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆమే చేసిన ‘రాధేశ్యామ్’ ఓ పాన్ ఇండియా సినిమా. అంతకు ముందే బాలీవుడ్‌లో పూజా అందరికీ తెలుసు. ‘రాధేశ్యామ్’తో ఆమె క్రేజ్ మరింత పెరగనుంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తోంది పూజా హెగ్డే. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ యేడాదే విడుదల కానుంది. రణవీర్ సింగ్‌తో ఓ హిందీ సినిమా చేసింది. ఇక తెలుగులో అత్యంత బిజీగా ఉండే హీరోయిన్ పూజానే. పాన్ ఇండియా సినిమా రుపొందుతుంది అంటే, ముందుగా పూజా పేరే వినిపిస్తోందట. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో తనని హీరోయిన్‌గా ఎంచుకుంటే బిజినెస్ పరంగా బాగుంటుందన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అందుకే పూజా ఎంత అడిగితే అంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారు. అలా పూజా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.

Pooja Hegde became Pan India Star

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News