Tuesday, December 17, 2024

పూజ క్యారెక్టర్ హైలైట్‌గా…

- Advertisement -
- Advertisement -

Pooja hegde Character Highlight‌ in Radhe Shyam movie

 

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ బ్యూటీ పూజాహెగ్డే హవా మాములుగా లేదు. వరుస సినిమాలతో ఆమె బిజీ బిజీ అయిపోతుంది. ఈ అమ్మడు డార్లింగ్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇదివరకే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రంలో పూజ క్యారెక్టర్ ఎంతో హైలైట్‌గా ఉంటుందట. ఈ పీరియడిక్ లవ్ స్టోరీలో ఆమె పోషించిన ప్రేరణ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది. ప్రభాస్ ఈ సినిమాలో విక్రమాదిత్యగా కనిపించనున్నాడు. మొదటిసారి – ప్రభాస్, పూజ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ ప్యూర్ లవ్ స్టోరీపై ప్రేక్షకులలో అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి. 1960–70ల నాటి కథతో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీని యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News