Monday, December 23, 2024

కొత్త పూజాహెగ్డేను చూస్తారు

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. 1970ల్లో జరిగే అందమైన ప్రేమకథ ఇది. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఛాలెంజింగ్ రోల్…
‘రాధేశ్యామ్’ చిత్రంలో హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపిస్తే నేను ప్రేరణ అనే పాత్రలో కనిపిస్తా. ఇలాంటి సీరియస్ క్యారెక్టర్‌ను నేను ఇంత వరకు చేయలేదు. నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. నా కెరీర్‌లోనే ఇది ఓ ఛాలెంజింగ్ రోల్. ఇక ప్రేరణ పాత్రలో ఒదిగిపోయి నటించాను.
కొత్త పూజాహెగ్డేను చూస్తారు…
నటనాపరంగా నాకు మంచి సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఈ సినిమాలో కొత్త పూజా హెగ్డేను చూస్తారు. ‘రాధేశ్యామ్’ చిత్రంతో నాలుగేళ్లు ప్రయాణించడం మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది. ఈ సినిమా నటిగా నాకు కొత్త విషయాలను తెలియజేసింది.
సరదాగా ఉంటాడు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. అతను సెట్స్‌లో తోటి నటులతో సరదాగా ఉంటాడు. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్‌గా ఉంటాడు. కొన్నిసార్లు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తీసుకొని వచ్చాడు. పలు వంటకాలు ఎంతో టేస్టీగా ఉన్నాయి.
రెండు సినిమాల్లో నటించినట్టు…
ఈ సినిమా తెలుగు, హిందీ వర్షన్లను ఒకేసారి చిత్రీకరించారు. స్టోరీ ఒకటే అయినప్పటికీ డైలాగ్స్ మారుతుండేవి. షూటింగ్ జరుగుతున్నప్పుడు రెండు సినిమాల్లో నటించినట్టు అనిపించింది. సినిమా పాటలకు అద్భుతమైన స్పందన వస్తున్నందుకు ఆనందంగా ఉంది.
మనసుకు నచ్చితేనే…
సినిమా స్టోరీకి తగ్గట్టుగా నటించడానికి ప్రాధాన్యతనిస్తా. పాత్ర డిమాండ్ మేరకు నటిస్తా. నా మనసుకు నచ్చిన పాత్రలనే ఎంపిక చేసుకుంటా. ఇప్పటివరకు చేసిన సినిమాలు హీరోయిన్‌గా నాకు మంచి క్రేజ్‌ను తీసుకువచ్చాయి.

Pooja Hegde Interview about Radhe Shyam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News