Monday, December 23, 2024

బాలీవుడ్ లో బిజీ కానున్న పూజా హెగ్డే…

- Advertisement -
- Advertisement -

Pooja Hegde Opposite Salman Khan in Kabhi Eid Kabhi Diwali

స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ భామ మరికొద్ది రోజుల్లో ఓ హిందీ సినిమా షూట్‌లో పాల్గొనాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చే ఓ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇందులో భాయ్‌కి జోడీగా పూజా నటించనుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేయాలి. కానీ కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడింది. ఈ సినిమాకి సల్మాన్ 90 రోజుల పాటు డేట్లు ఇచ్చారు. పూజా కూడా ఎక్కువ రోజులే డేట్లు కేటాయించినట్లు సమాచారం. దీంతో ఈ లోపు సినిమా పూర్తిచేయాలి. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌మేకర్స్ వచ్చే నెల నుంచి షూట్‌కి సర్వం సిద్దం చేస్తున్నారు. ఇక పూజా హెగ్డే… సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. అలాగే ‘భవదీయుడు భగత్ సింగ్’లోనూ ఆమె హీరోయిన్ అని తెలిసింది.

Pooja Hegde Opposite Salman Khan in Kabhi Eid Kabhi Diwali

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News