Thursday, February 27, 2025

మూగ, చెవిటి యువతిగా పూజ హెగ్డే

- Advertisement -
- Advertisement -

అందాల తార పూజ హెగ్డే తెలుగుతో పాటు తమిళంలో పలు హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ భామ ప్రస్తుతం మంచి నటిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆమె సూర్య సరసన రెట్రో చిత్రంలో డీగ్లామ్ రోల్ చేసింది. సగటు యువతి పాత్రలో మెప్పిస్తోంది. ఇక ఒక కొత్త సినిమాలో ఆమె మూగమ్మాయిగా కనిపించనుందట. రాఘవ లారెన్స్ ఇప్పటికే ఎన్నో కాంచన సినిమాలు తీశాడు రకరకాల పేర్లతో. మళ్ళీ అదే సిరీస్‌లో నాలుగో సినిమా తీస్తున్నాడు. ఈ ‘కాంచన 4’లో పూజా హెగ్డేకి ప్రధాన పాత్ర దక్కింది. ఇందులో ఆమె మూగ, చెవిటి యువతిగా కనిపిస్తుందట. ఈ పాత్ర ఆమెకి ఛాలెంజ్. ఈ సవాల్ ని పూజ స్వీకరించింది. ప్రస్తుతం పూజ హెగ్డే తమిళంలో రెట్రో (మే 1న విడుదల), విజయ్ సరసన జన నాయగన్, కాంచన 4 చిత్రాలు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News