Saturday, January 11, 2025

మరోసారి నాగచైతన్యకు జోడీగా పూజా హెగ్డే..

- Advertisement -
- Advertisement -

స్టార్ బ్యూటీ పూజాహేగ్డే బాలీవుడ్‌కు వెళ్లి తిరిగివచ్చి సౌత్‌లో మళ్లీ బిజీ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో ఓ సినిమాకి సైన్ చేసింది ఈ భామ. కోలీవుడ్ లో సూర్య 44వ చిత్రంలోనూ ఈ అమ్మడే హీరోయిన్. దళపతి విజయ్ 69వ చిత్రంలో సైతం పూజానే హీరోయిన్. ఇవి చేతిలో అధికారికంగా ఉన్న ప్రాజెక్ట్ లు. అనధికారంగా ఇంకా మూడు నాలుగు సినిమాలను ఈ బ్యూటీ ఓకే చేసినట్లు సమాచారం.

అయితే తన మనసుకు దగ్గరైన పాత్ర ఏది అంటే… సూర్య 44వ చిత్రం అంటోంది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ “ప్రేమ, యుద్దం, నవ్వు చుట్టూ తిరిగే కథ ఇది. ఈ కథకు నా పాత్ర వెన్నుముక. ఇంత ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడం నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి” అని పేర్కొంది. ఇక సూర్య 44వ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News