Monday, December 23, 2024

మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ!

- Advertisement -
- Advertisement -

Pooja Hegde training Martial Arts for 'JGM' Movie

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘జనగణమన’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని ముంబయ్‌లో ప్రారంభించారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్టోరీ ఇది. దీంతో విజయ్ సైనికుడిగా కనిపిస్తాడా? మేజర్ గా కనిపిస్తాడా? అన్నది ఉత్కంఠగా మారింది. కాశ్మీర్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కావడంతో యాక్షన్ సన్నివేశాలు పతాక స్థాయిలో ఉంటాయని తెలిసింది. సాధారణ చిత్రాల్లోనే పూరి యాక్షన్ పీక్స్‌లో ఉంటుంది. ఇక వార్ సినిమాలో ఇంకే స్థాయిలో హీరోని ఎలివేట్ చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తుంది. ఆమె పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలిసింది. ఆమె కోసం ఏకంగా థాయ్‌లాండ్ నుంచి మార్షల్ ఆర్ట్ ట్రైనర్‌నే ముంబయ్‌కి రప్పిస్తున్నారట. పూజాహెగ్డే రోల్ కూడా హీరోకి ధీటుగానే సాగుతుందట.

దీంతో పూజా హెగ్డేకి మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ ఇప్పిస్తారట. బుధవారం నుంచి ఈ భామకి మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. మూడు రోజుల పాటు ఏక ధాటిగా ఈ శిక్షణ కొనసాగుతుందట. అనంతరం కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ట్రైనింగ్ ఉంటుందని తెలిసింది. అదే నిజమైతే పూజా వెండి తెరపై సరికొత్తగా కనిపించడం ఖాయం. ఇప్పటివరకు గ్లామర్ డాల్‌గానే మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు యాక్షన్ సన్నివేశాల్లో మెరవనుంది. ఇక ‘జనగణమన’ షూటింగ్ జూన్ 4 నుంచి మొదలవుతుంది. నాలుగు రోజుల పాటు మొదటి షెడ్యూల్ ముంబయ్‌లోనే జరుగుతుంది. అక్కడ నుంచి షూటింగ్ కాశ్మీర్ కి షిప్ట్ అవుతుందని సమాచారం. అవసరం మేరకు కొన్ని షెడ్యూల్స్ హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

Pooja Hegde training Martial Arts for ‘JGM’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News