Sunday, April 6, 2025

శ్రీకాళహస్తీలో పూజా హెగ్డే ప్రత్యేక పూజాలు..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: జిల్లాలోని శ్రీకాళహస్తీలో ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే సందడి చేశారు. గురువారం  శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలసి పూజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న పూజా.. అనంతరం రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

కాగా, పూజా హెగ్డే ప్రస్తుతం తమిళ్ లో రెట్రో సినిమా చేస్తున్నారు.ఇందులో సూర్యకు జోడీగా పూజా నటిస్తోంది.ఇక, తెలుగులో మాత్రం ఆమె.. ఇప్పటివరకు ఏ చిత్రాన్ని అంగీకరించలేదు. కొన్ని చిత్రాలు ప్లాప్ కావడంతో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆచి తూచి సినిమాలను ఎంపిక చేస్తోంది పూజా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News