Sunday, December 22, 2024

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌ కు షాక్.. ట్రైనింగ్ నిలిపివేత

- Advertisement -
- Advertisement -

ముంబై: సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం కోసం శారీరక వైకల్య సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ పొందుతున్న జిల్లా శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వం మంగళవారం నిలిపివేసింది. జులై 23వ తేదీ లోగా ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు తిరిగి వచ్చి రిపోర్టు చేయాలని పూజా ఖేడ్కర్‌ను ప్రభుత్వం ఆదేశించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. తదుపరి చర్యల నిమిత్తం ఆమెను వెనక్కు పిలిపించాలని అకాడమీ నిర్ణయించినట్లు ఆ అధికారి చెప్పారు.

మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి మిమల్ని రిలీవ్ చేస్తున్నామని, ఎట్టి పరిస్థితిలులలోను జులై 23 లోగా అకాడమీకి రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రటరీ నితిన్ గద్రె నుంచి పూజా ఖేడ్కర్‌కు లేఖ జారీ అయినట్లు అధికారి తెలిపారు. పుణెలో ట్రెయినీ కలెక్టర్‌గా చేరిన పూజా ఖేడ్కర్(34) తనకు విడిగా కార్యాలయం, అధికారిక కారు, కారుపైన ఎర్ర బుగ్గ కావాలని డిమాండు చేసి పూజా ఖేడ్కర్ వివాదంలో చిక్కుకున్నారు. పుణె కలెక్టర్ ఆదేశం మేరకు ఆమెను వాషీంకు ప్రొబేషనరీ కలెక్టర్‌గా ఇటీవలే బదిలీ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News