Monday, December 23, 2024

మూడు రోజులుగా మతిస్థిమితం లేని మహిళ పూజలు

- Advertisement -
- Advertisement -

బెజ్జూరు: బెజ్జూరు మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి శివాలయం, శ్రీపోతులూరి వీరబ్రహ్మంద్ర స్వామి ఆలయాల్లో మతిస్థిమితం లేని ఓ మహిళ మూడు రోజుల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. తోలి ఏకదశి పురస్కారించుకోని మహిళ తలంటు స్నానం చేసి ఆలయానికి బావి నుండి నీరు తీసుకువచ్చి ఆలయాన్ని శుభ్రంగా కడిగి ప్రత్యేక పూజలు నిర్వహించడం భక్తులను అశ్చ ర్యానికి గురి చేసింది.

ఆ మహిళ ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కాని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం చూసి భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి ఆలయం వందల సంవత్సరాల చరిత్ర గల అలయం దేశంలోనే రెండవ ఆలయం బెజ్జూరు మండల కేంద్రంలో కలదు.

ఇట్టి ఆలయానికి ముక్కోటి ఏకదశి రోజు, మహాశివరాత్రి రోజు తెలంగాణ, మహారాష్ట్ర, అంధ్రప్రదే శ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తారు. శ్రీరంగనాయక స్వామి ఆలయం మహిమ గల ఆలయం అని చెప్పడానికి ఈ నిదర్శనాలు చాలు. కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం లేని వ్యక్తులు ఎక్కడికెల్లి వస్తారో ఎలా వస్తారో తెలియదు కాని నెల రోజుల పాటు ఉండి ఆలయంలో పూజలు చేస్తే చాలు వీరు మములు మనుషులుగా మారి వారు స్వగ్రామాలకు కూడా వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నా యి.

ఇప్పటికి కూడా బెజ్జూరు మండలంలో ఇద్దరు వ్యక్తులు ఎక్కడకెళ్లి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు కాని వారు మాములు మనుషులుగా మారి మండల కేంద్రంలోనే నివాసం ఉంటున్నారు. ఇంత మహిమ గల, చరీత్ర గల శ్రీ రంగనాయక స్వామి ఆలయం బెజ్జూరు మండల కేంద్రం లో ఉండడం మండల ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News