Tuesday, November 5, 2024

క్వార్టర్స్‌లో పూజారాణి

- Advertisement -
- Advertisement -

Pooja Rani reaches quarter finals at Tokyo Olympics

ఒకటి గెలిస్తే పతకం ఖాయం

టోక్యో: భారత యువ బాక్సర్ పూజారాణి (75 కిలోలు) టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని పెను ప్రకంపనలు సృష్టించింది. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో పూజారాణి సంచలన విజయం సాధించింది. ఒక మ్యాచ్ గెలిస్తే పూజాకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతోంది. మహిళల బాక్సింగ్‌లో ఇప్పటికే మరో యువ బాక్సర్ లవ్లీనా క్వార్టర్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. అల్జీరియా బాక్సర్ ఇచ్రక్ చైబ్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో పూజారాణి 50 తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన భారత సంచలనం పూజా 3026, 3027, 3027, 3027, 3027 పాయింట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది.

అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే పూజా ఏకంగా క్వార్టర్ ఫైనల్‌కు చేరి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇచ్రక్‌తో జరిగిన మ్యాచ్‌లో పూజాకు ఎదురే లేకుండా పోయింది. కళ్లు చెదిరే పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. పూజా ధాటికి ఇచ్రక్ కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండానే చేతులెత్తేసింది. ఐదు రౌండ్లలోనూ భారత స్టార్ విజయం అందుకుంది. ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురుకాక పోవడంతో పూజారాణి అలవోకగా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే పూజారాణికి పతకం ఖాయమవుతోంది.

ఒక్క అడుగు దూరంలో..

మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్‌కు మహిళా బాక్సర్లు కాస్త ఊరటనిచ్చారు. ఇప్పటికే లవ్లీనా, పూజారాణిలు క్వార్టర్ ఫైనల్‌కు చేరడంతో బాక్సింగ్ విభాగంలో పతకం ఆశలు చిగురించాయి. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. ఇక పూజారాణి, లవ్లీనాలు ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే కాంస్య పతకం ఖాయమవుతోంది. దీంతో వీరిద్దరిపై భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. షూటింగ్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, టిటి తదితర విభాగాల్లో భారత ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన విషయం తెలిసిందే. దీంతో కనీసం బాక్సర్లు అయినా పతకాలు అందిస్తారనే ఆశతో కోట్లాది మంది బారతీయులు ఎదురు చూస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News