బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై ఆమె భర్త శామ్ బాంబే దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పూనమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. మొదటి భార్య అల్విరాతో భర్త తరచుగా మాట్లాడుతుండడంతో ఇద్దరి మధ్య గొడవకు దారితీసినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా సహజీవనం చేసిన వీరిద్దరూ గతేడాది సెప్టెంబర్1న వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్, పూనమ్ ను విచక్షణరహితంగా కొట్టడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది. తర్వాత శామ్ క్షమాపణలు చెప్పడంతో మళ్లీ ఇద్దరు ఒక్కటయ్యారు. అయితే, మరోసారి పూనమ్ పై ఆమె భర్త దాడి చేశాడు. పూనమ్ జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టడంతో ఆమె తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పూనమ్.. ఓ మీడియా ఛానల్ మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. కాగా, పూనమ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె భర్తను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
Poonam Pandey attacked by her husband