Wednesday, January 22, 2025

ఉగ్రవాదుల కోసం అడవిలో సైన్యం వేట

- Advertisement -
- Advertisement -

పూంచ్‌లో ఘటనా స్థలానికి సైనిక ఉన్నతాధికారులు

పూంచ్/జమ్మూ: ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులుకాగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడిన దారుణ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు శుక్రవారం జమ్మూకశ్మీరు పూంచ్ జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. భారతీయ సైన్యానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టెనెంట్ జనరల్ సందీప్ జైన్ శుక్రవారం భద్రతా దళాల వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనా స్థలాన్ని సందర్శించి, సైనిక, పోలీసు ఉన్నతాధికారులతో సమీపింయారని అధికారులు తెలిపారు.

సురాన్‌కోట్‌లో గురువారం గ్రవాదులతో అత్యంత వీరోచితంగా పోరాడి అమరులైన నలుగురు జవాన్లకు నివాళుర్పిస్తున్నట్లు భారతీయ సైన్యం, వైట్ నైట్ కోర్స్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నాయి. గురువారం మధ్యాహ్నం పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన రెండు వాహనాలపై కాల్పులు జరిపిన గవాదుల ఆచూకీ కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు జరుపుతున్నామని, పోలీసు జాగిలాలను కూడా రంగంలోకి దింపామని ఒక అధికారి తెలిపారు. ఆ ప్రాంతాన్ని గత రాత్రి దిగ్బంధించిన భద్రతా దళం శుక్రవారం ఉదయం భారీ స్థాయిలో మార్డన్ సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు అధికారి ఒకరు తెలిపారు.

కాల్పులకుపాల్పడిన ఉగ్రవాదుల కోసం అదనపు బలగాలను కూడా రప్పించినట్లు ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో ఆర్డన్,సర్చ్ ఆపరేషన్ కోసం రెండు వాహనాలలో వెళుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి జరిపారు. సురాన్‌కోట్ పోలీసు స్టేషన్ పరిధిలోని డేరా కీ గలి, బఫ్లీజ్ మధ్య ఒక మూలమలుపు వద్ద ఈ కాల్పుల దాడి జరిగింది. డేరా కీ గలీని భద్రతా దళాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయని, అక్కడ ట్రాఫిక్ ఆంక్షలను విధించిందని అధికారి తెలిపారు.

సైన్యం, పోలీసుకు చెందిన ఉన్నతాధికారాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. దాడికి పాల్పడిన ముగ్గురు లేదా నలుగురు సాయుధ ఉగ్రవాదులు సైనిక వాహనాలపై మెరుపు దాడి చేసేందుకు మూలమలుపును ఎంచుకుని పక్కన కొండ పైన తిష్ఠవేశారని అధికారి చెప్పారు. దాడి తరువాత అమరులైన ఇద్దరు భద్రతా జవాన్ల శరీరాలను ముక్కలు చేసిన ఉగ్రవాదులు వారి నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లారని అధికారి చెప్పారు. ఉగ్రవాదుల దాడి జరిపిన పద్ధతి, వాడిన ఆయుధాలను తెలుసుకునేందుకు ఆ ప్రదేశం వద్ద దర్యాప్తు జరుగుతున్నట్లు భద్రతాధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News