Sunday, December 22, 2024

పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని పూంచ్‌లో ఐఎఎఫ్ కాన్వాయ్‌పై శనివారం ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల ఊహాజనిత చిత్రాలను పోలీస్‌లు విడుదల చేశారు. పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీస్‌లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీరి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు.

ఉగ్రవాదుల దాడిలో విక్కీ పహాడ్ అనే ఎయిర్‌ఫోర్స్ అధికారి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రక్షణ దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News