Friday, November 15, 2024

పేదోడు..పేదోడే, వ్యత్యాసం ఎందుకు : బూర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పేదోడు పేదోడే.. ఒకరికి పది లక్షలు మరొకరుకు లక్ష ఏంది ఇది అంటూ బిజెపి నేత, మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిసి ఘోష పోస్టర్ ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం బిసిల మీద కక్ష పెంచుకుందన్నారు. బిసిలను అష్ట దిగ్బంధనం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 15 లక్షల బిసి కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

బిజెపి ఓబిసి సమ్మేళనానికి భయపడే రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు లక్ష రూపాయల పథకం పెట్టారన్నారు. ఈ పథకం పూర్తి కావాలంటే వందేళ్లు కావాలని విమర్శించారు. ముగ్గురు బిసి మంత్రులకు అసలు చీము నెత్తురు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదోడు పేదోడే… ఒకరికి పది లక్షలు మరొకరికి లక్ష ఏంది ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభ సమావేశాలు నిర్వహించి బిసి సబ్ ప్లాన్ కి చట్టబద్దత కల్పించాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో బిసిలు ప్రతీకారం తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో బిజెపి నేతల విఠల్, సుద్దగాని హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News