Thursday, January 23, 2025

ధరణి వల్ల పేదలు నష్టపోతున్నారు : విహెచ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ధరణి విషయంలో మాయమాటలతో ప్రభుత్వం ప్రలోభాలకు గురిచేస్తోందని సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అన్నారు. ధరణి వల్ల పేదలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. గతంలో రాజీవ్ గాంధీ నిరుపేదలకు పంచిన భూములు తిరిగి భూస్వాములకు దక్కటానికి మాత్రమే ధరణి ఉపయోగపడుతుందని ఆయనన్నారు. ఓఆర్‌ఆర్ సమీపంలో ఆనాడు పేదవారికి పంచిన భూములు ఇప్పుడు ఎకరం 5 కోట్లు పలుకుతుందని ఆయన తెలిపారు. 100 ఎకరాల భూమి ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకొని భూస్వాములకి రెవిన్యూ శాఖ కట్టపెట్టిందని ఆరోపించారు. 12న నిజ నిర్ధారణ కోసం క్షేత్రస్థాయిలో భూముల అసలు యజమానులను మీడియా ముందుకు తీసుకొస్తామన్నారు. ధరణివల్ల అంతా బాగుందని చెప్పడం సరికాదని వాస్తవాలు వేరే విదంగా ఉన్నాయని, పేదల భూములు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News