Monday, December 23, 2024

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం పేదల ధర్నా

- Advertisement -
- Advertisement -

హన్మకొండ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని కోరుతూ హన్మకొండ పట్టణంలో సోమవారం పేదలు ధర్నా నిర్వహించారు. బాలసముద్రం ప్రెస్ క్లబ్ సమీపంలోని జితేందర్‌నగర్‌లో ఈ ధర్నా జజరిగింది. ఏడేళ్ల క్రితం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అక్కడ నివసిస్తున్న పేదలైన అంబేద్కర్ నగర్, జితేందర్‌నగర్ వాసులకు ఇవ్వకుండా ఆలస్యం చేసినందుకు గాను సోమవారం ఉదయం రెండు కాలనీలకు చెందిన సుమారు 400 మంది గుడిసెవాసులు బస్తీ కమిటీ సభ్యులు ఎర్ర చంద్రమౌళి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు పేదలు మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా తమకు ఇళ్లు ఇవ్వకుండా నిర్లక్షం చేస్తున్నారన్నారు. గత సంవత్సరం నుంచి ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్న దాస్యం వినయ్‌భాస్కర్ తమకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామంటూ చెప్పారని, కాని తమకు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. తాము రోడ్డుపై జీవిస్తున్నామని, వెంటనే తమకు జితేందర్‌నగర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News