హైదరాబాద్: హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాది రోజున పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రానుందని అన్నారు. రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం అందనుందని తెలిపారు. రేషన్ బియ్యాన్ని చాలామంది ఉపయోగించుకోవడం లేదని.. దొడ్డు బియ్యం తినకుండా కొందరు బ్లాక్‌లో అమ్ముతున్నారని పేర్కొన్నారు. బియ్యంతో పాటు త్వరలోనే పప్పు, ఉప్పు వంటి వస్తువులు కూడా త్వరలో ఇస్తామని హామీ ఇఛ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకొనేలా ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త రేషన్‌కారులు ఎంతమందికి కావాలన్న వారి అర్హతను బట్టి ఇస్తున్నామని. కార్డు లేకున్న లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే బియ్యం ఇస్తామని అన్నారు. రేషన్ బియ్యంపై కేంద్ర రాష్ట్రాలు కలిసి రూ.10,665 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.