అననుకూల వాతావరణం వల్ల ఢాకాకు మళ్లింపు
ముంబయి నుంచి బయలుదేరిన విమానం
గువాహటి/ ముంబయి : ముంబయి నుంచి బయలుదేరిన ఇండిగో విమానం ఎట్టకేలకు శనివారం ఉదయం గువాహటిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డొలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి ముందుగా గువాహటికి చేరుకోవలసిన ఇండిగో విమానాన్ని అననుకూల వాతావరణం కారణంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు మళ్లించినట్లు వారు తెలిపారు. అసలు శుక్రవారం రాత్రి గువాహటి చేరుకోవలసిన విమానం శనివారం ఉదయం 11.10 గంటలకు విమానాశ్రయంలో దిగిందని అధికారులు వివరించారు.
విమానం శనివారం ఉదయం 10.54 గంటలకు (బంగ్లాదేశ్ సమయం) నగరానికి చేరుకున్నది. ఇండిగో 5319 విమానాన్ని గువాహటిలో అననుకూల వాతావరణం వల్ల ఢాకాకు మళ్లించవలసి వచ్చిందని, ‘కోల్‌కతా, భువనేశ్వర్‌లో విమానాన్ని ది ంపాలని తొలుత యోచించాం’ అని విమానాశ్రయం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు,. ‘అననుకూల వాతావరణం వల్ల కోల్‌కతాలో విమానాన్ని దింపడం కుదరలేదు. భువనేశ్వర్‌లో రన్‌వేను మూసివేశారు. విమానాన్ని ఢాకాకు మళ్లించవలసి వచ్చింది’ అని ఆ ప్రతినిధి వివరించారు. ఢాకా నుంచి గువాహటికి విమానం నడిపేందుకు ప్రత్యామ్నాయ సిబ్బందిని నియోగించినట్లు ఆ ప్రతినిధి తెలిపారు.