Friday, December 20, 2024

పెళ్లి చేసుకోలేదని ప్రియుడ్ని చంపిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రమ్ములో మృతదేహాన్ని పెట్టి చెరువులో పడేసి కేసును పోలీసులు చేధించిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. తనని పెళ్లి చేసుకోలేదని ప్రియుడిని మాజీ ప్రియురాలు మరో ప్రియుడితో కలిసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పురన్ సింగ్ అనే వ్యక్తికి జయదేవి అనే ప్రియురాలు ఉండేది. పురన్ సింగ్ హైదరాబాద్‌లో పానీ పూరి బండి నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పురన్ సింగ్ మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో అప్పటి నుంచి జయదేవి పగతో రగిలిపోతుంది.

పురన్ సింగ్ హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసుకొని అతడి గురించి వివరాలు అడిగి తెలుసుకుంది. పురన్ సింగ్‌కు నజీమ్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తనకు పురన్ సింగ్ అన్యాయం చేశాడని తన బాయ్ ప్రెండ్ నజీమ్‌కు తెలిపింది. పురన్ సింగ్ తన దగ్గరకు జయదేవి పిలిపించుకుంది. ఎప్రిల్ 22న నజీమ్ మరో మైనర్ సుగుణారామ్‌తో కలిసి పురన్ సింగ్‌ను జయదేవి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి చెరువులో పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News