హైదరాబాద్: డైనమిక్ త్రయం భవ్య గవర రెడ్డి, పద్మజ గవర, అజ్మీరా పూజా పవార్‌లచే నిర్వహించబడుతున్న మార్గదర్శక కార్యక్రమం, రిజర్వ్, తమ మొదటి ఎడిషన్ పాప్-అప్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని చిక్ నవోమి కేఫ్‌లో ఇది జరిగింది. నగరంతో పాటుగా పలు ప్రాంతాలకు చెందిన అగ్రశ్రేణి లేబుల్‌ల, ఆకట్టుకునే శ్రేణిని ప్రదర్శించింది.
రిజర్వ్ యొక్క మొదటి ఎడిషన్ ఫ్యాషన్ ప్రియులకు ఆనందానుభూతులను అందించడానికి, దుస్తులు, ఉపకరణాల నుండి గృహాలంకరణ, కళాకృతుల వరకు విభిన్న ఎంపికలతో రూపొందించబడింది. అన్ని వయసుల వారిని ఆకట్టుకునే రీతిలో రూపొందించబడిన ఈ ప్రదర్శన కొనుగోలుదారులకు ఆనందం, ఉత్సాహాన్ని తీసుకురావడానికి ఉద్దేశించబడింది. ప్రత్యేక భాగస్వామ్యంలో భాగంగా శాంతికిరణ్ జ్యువెలర్స్ బై ముసద్దిలాల్ తో కలిసి రిజర్వ్ ఈ ఈవెంట్‌ను నూతన శిఖరాలకు చేర్చింది.
“మొదటి ఎడిషన్ ను రూపొందించడంలో, మా లక్ష్యం సంప్రదాయ షాపింగ్ ఈవెంట్‌లకు అతీతంగా ఉంది. వైవిధ్యం, సృజనాత్మకత, లగ్జరీ యొక్క స్ఫూర్తిని వేడుక చేసుకునే ప్రాంగణం సృష్టించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని ఫౌండర్ లలో ఒకరైన పద్మజ గవర చెప్పారు. “శాంతికిరణ్ జ్యువెలర్స్ బై ముసద్దిలాల్ తో చేసుకున్న భాగస్వామ్యం ద్వారా, సందర్శకులకు లీనమయ్యే అనుభవాన్ని అందించాలని మేము కోరుకున్నాము” అని అన్నారు. భవ్య గవర రెడ్డి, పద్మజ గవర, అజ్మీరా పూజా పవార్ మొదటి ఎడిషన్ ను వైవిధ్యం, సృజనాత్మకత వేడుక లా తీర్చిదిద్దారు.
రిజర్వ్ తొలి ఎడిషన్ పాప్-అప్ ఎగ్జిబిషన్ హైదరాబాద్‌లోని సాంస్కృతిక, షాపింగ్ ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్వచించే లక్ష్యంతో అద్భుతమైన ఈవెంట్‌ల శ్రేణికి నాంది పలికింది.