- Advertisement -
వాటికన్: క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఈ విషయాన్ని వాటికన్ అధికారికంగా ధృవీకరించింది. ఫిబ్రవరిలో శ్వాసకోస సమస్యలతో పోప్ ఆస్పత్రిలో చేరారు. వాటికన్ సిటీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో ఆయన జన్మించారు. 2013 మార్చి 13న ఆయన 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైనా మొట్టమొదటి వ్యక్తిగా పోప్ నిలిచారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం ఆయన సందేశం కూడా ఇచ్చారు. పోప్ మృతితో ఆయన క్రైస్తవులు శోకసంద్రంలో మునిగిపోయారు. తదుపరి పోప్‌ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజ్ ఎంపిక చేయనుంది.
- Advertisement -