Monday, April 28, 2025

తదుపరి పోప్ ఎవరు?

- Advertisement -
- Advertisement -

వచ్చే నెల 7 నుంచి కార్డినల్స్ భేటీ
వాటికన్ సిటీ: దివంగత పోప్ ఫ్రాన్సిస్ వారసుడి ఎంపిక ప్రక్రియ వచ్చే నెల 7వ తేదీ నుంచి ఆరంభమవుతుంది. కొత్త పోప్ ఎంపిక విధానంలో కార్డినల్స్ ఓటు కీలకం అవుతుంది ఈ హక్కు ఉన్న పలువురు కార్డినల్స్ ఒక్కరిని మరొకరు పరిచయం చేసుకోవడానికి, వారి పూర్వాపరాలు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీనితో ఎన్నిక ప్రక్రియ రెండు రోజులు వాయిదా పడిందని చర్చి అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయి ఏకాభిప్రాయం సాధనతో తదుపరి పోప్‌ను ఎన్నుకునేందుకు వీలుగా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. పోప్ అంత్యక్రియల తరువాత జరిగిన ఆంతరంగిక సమావేశంలో పోప్ ఎంపిక తేదిని ఖరారు చేశారు. కాగా పోప్ ఎంపిక వివాదానికి దారితీస్తోందని, కార్డినల్స్ మధ్య సరైన సయోధ్య లేదనే వార్తలతో మీడియా పలు ప్రసారాలను వెలువరించింది. దీనితో మరింత గందరగోళం ఏర్పడింది.

శనివారం నాటి ఆంతరంగిక సమావేశం హాల్ వెలుపల పలువురు జర్నలిస్టులు గుమికూడారు. లోపల అసలేం జరుగుతోంది? అంటూ జర్నలిస్టులు మత పెద్దలను ప్రశ్నలతో ఇరుకున పెట్టారు. ఎంపిక ఎప్పుడు జరుగుతుంది? తేదీ ఖరారు అయిందా? ఏం జరుగుతోంది? అంతా కలిసికట్టుగా వ్యవహరిస్తున్నారా? లేక ఇతరత్రా ఏమైనా ఉన్నత స్థాయి లొసుగులు తలెత్తాయా? అనే ప్రశ్నలతో కార్డినల్స్ కంగుతిన్నారు. క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఓ కార్డినల్‌ను కూడా ఓటింగ్‌కు అనుమతిస్తున్నారా? అని ఓ జర్నలిస్టు నిలదీశారు. దీనికి కార్డినల్స్ బృందం నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. తదుపరి పోప్ ఎన్నిక అంతా కూడా కార్డినల్స్‌తో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్, తరువాతి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో తదుపరి పోప్ ఎంపిక విషయంలో అన్ని వర్గాలూ కార్డినల్స్ స్పందన గురించే ఎదురుచూస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News