- Advertisement -
రోమ్: ఆసుపత్రిలో చేరి పది రోజులయ్యాక పోప్ ఫ్రాన్సిస్ తేరుకున్నారని వాటికన్ వర్గాలు తెలిపాయి. లంగ్ ఇన్‌ఫెక్షన్, మూత్ర పిండ లోపం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ‘ఆయన రాత్రి హాయిగానే గడిపారు, బాగా నిద్రపోయి రెస్ట్ తీసుకున్నారు’ అని సోమవారం విడుదలైన మెడికల్ బుల్లెటిన్ పేర్కొంది. ఆయన కృత్రిమ లేక లిక్విడ్ న్యూట్రిషన్ తీసుకోకుండా స్వయంగా భోంచేస్తున్నారని వాటికన్ వర్గాలు తెలిపాయి. 88 పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారన్నది తెలిసిన విషయమే. పోప్ ఫ్రాన్సిస్‌కు ఉన్న తీవ్ర ముప్పు ఏమిటంటే ఆయనకు రక్త సంబంధమైన తీవ్ర రోగం ‘సెప్సీస్’ తో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా పనిచేసి పోప్ ఆయననే చెప్పాలి.
- Advertisement -