రోమ్: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా గుమ్మం ముందు నాటో మొరగడమే ఈ దండయాత్రకు కారణమై ఉండొచ్చు అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇటలీలోని ఓ స్థానిక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్‌పై రష్యా వైఖరిపై పోప్‌ను ప్రశ్నించినప్పుడు, “ రష్యా సమీప దేశాల్లో నాటో ఉనికి పుతిన్‌ను రెచ్చగొట్టి ఉంటుంది. దాని ఫలితమే ఉక్రెయిన్‌పై ఈ దురాక్రమణ అనుకుంటున్నా” అన్నారు. ప్రస్తుత నరమేధంను 1990 దశకంలో చోటుచేసుకున్న నరమేధంతో పోల్చారు. 1994లో రువాండాలో టుట్సీ మైనారిటీలను తుడిచిపెట్టేందుకు అతివాద హుతూ పాలకులు అరాచకాలకు పాల్పడ్డారని, ఆ మారణహోమంలో దాదాపు 8 లక్షల మంది మరణించారని పోప్ తెలిపారు. ఇదిలావుండగా నాటోపై పోప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. యుద్ధాన్ని ఆపేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించాలనుకుంటున్నట్లు కూడా పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు. ఇందుకు తాము క్రెమ్లిన్‌ను అప్పాయింట్‌మెంటు కోరగా అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. తనతో భేటీ అయ్యేందుకు పుతిన్‌కు ఆ ఉద్దేశ్యం ఉందో లేదోనన్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లడం కన్నా ముందు తాను మాస్కో వెళ్లి పుతిన్‌ను కలుస్తానని తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తానని కూడా తెలిపారు.
పోప్ సంచలన వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -