- Advertisement -
బాగ్దాద్: దశాబ్దాల తర్వాత పోప్ ఫ్రాన్సిస్ మొదటిసారి ఇరాక్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం మధ్యాహ్నం పోప్, ఆయన అనుచరులతో వెళ్లిన విమానం బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానంలో ల్యాండైంది. పోప్‌కు ఇరాక్ అధికారులు రెడ్‌కార్పెట్ స్వాగతం పలికారు. 2003లో ఇరాక్ అప్పటి అధ్యక్షుడు సద్దాంహుస్సేన్‌ను పదవీచ్యుతిడిని చేయడమే లక్షంగా అమెరికా సైన్యం ఆ దేశంలోకి ప్రవేశించిననాటి నుంచి అంతర్యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగింది. దాంతో, ఆ దేశంలోకి వెళ్లేందుకు వాటికన్ నగరానికి చెందిన పోప్‌లెవరూ ఆసక్తి చూపలేదు.
- Advertisement -