Sunday, January 19, 2025

ప్రముఖ బెంగాలీ నటుడు ప్రదీప్ ముఖర్జీ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Popular Bengali actor Pradip Mukherjee passes away

కోల్‌కత: ప్రముఖ బెంగాలీ నటుడు, సత్యజిత్ రే దర్శకత్వం వహించిన జన అరణ్య చిత్ర కథానాయకుడు ప్రదీప్ ముఖర్జీ సోమవాకం కోల్‌కతలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు 76 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో మూడు రోజుల క్రితం ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి మార్చినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 8.15 గంటలకు తుదిశ్వాస విడిచారని వారు చెప్పారు. ప్రదీప్ ముఖర్జీ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన జన అరణ్య, రీతూపర్ణో ఘోష్ దర్శకత్వం వహించిన ఉత్సవ్, బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన దూరత్వ చిత్రాలలో ప్రదీప్ ముఖర్జీ అపురూపమైన నటనను కనబరిచారని ఆమె తెలిపారు. ప్రదీప్ ముఖర్జీ 40కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన చివరిగా 2021లో తోరలతర్ భూత్ అనే చిత్రంలో నటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News