Sunday, December 22, 2024

ప్రముఖ బుల్లితెర నటి వైశాలి ఠక్కర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Popular TV actress Vaishali Thakkar committed suicide

న్యూఢిల్లీ: ప్రముఖ ముంబై టీవీ సీరియల్ నటి వైశాలి ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీవీ నటి వైశాలి ఠక్కర్ ఒక సంవత్సరం పాటు ఇండోర్‌లో నివసిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైశాలి ‘యే రిష్తా క్యా కెహ్లతా హై’లో తన పాత్రకు ప్రసిద్ధి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. పలు హిందీ సీరియళ్లు, చిత్రాల్లో వైశాలి ఠక్కర్ నటించారు. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ కు ఠక్కర్ వైశాలి స్నేహితురాలు. సుశాంత్ మృతికి రియా చక్రవర్తి కారణమని వైశాలి ఆరోపించింది. ఈ ఘటనపై తేజాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News