Sunday, December 22, 2024

మెట్రో సూపర్ వేవ్ ఆఫర్‌కు ఆదరణ

- Advertisement -
- Advertisement -

Popularity for Metro Super Saver offer

సెలవుల్లో పెద్ద సంఖ్యలో నగరవాసులు కొనుగోలు
రూ. 59తో రోజంతా తిరుగుతున్న యువకులు
ఆఫర్ తీసుకరావడంతోపై మెట్రో సిబ్బందిపై హర్షం

హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో ప్రయాణీకులను ఆకట్టుకుంటూ లాభాలో బాటలో పడేందుకు అధికారులు నూతన ఆఫర్లు తీసుకొస్తూ నగరవాసులను మెట్రోవైపు మళ్లీస్తున్నారు. ఇటీవలే ఏడాదిలో 100 సెలవు దినాల్లో నగరమంతా తిరిగేందుకు రూ. 59 ఆఫర్ తీసుకొచ్చి మెట్రో స్టేషన్లు రద్దీమయంగా చేస్తున్నారు. ఉగాది పండగను పురస్కరించి ఈఆఫర్ ప్రారంభిండచంతో చాలామంది ప్రజలు సెలవుల్లో ఈకార్డును కొనుగోలు చేసి నగరంలో పలు పర్యటన ప్రాంతాలు తిరుగుతూ ఈఆఫర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెలవులు దినాల్లో రోజుకు 8వేల వరకు కార్డు విక్రయాలు జరిగినట్లు సిబ్బంది వెల్లడిస్తున్నారు. అదే విధంగా ప్రతినిత్యం పలు ప్రాంతాలకు ప్రయాణించే వారికి సమయం ఆదా చేసేందుకు ఇటీవలే రైళ్ల వేగం 70 నుంచి 80కి పెంచడంతో త్వరగా గమ్యస్దానాలకు చేరుకుంటున్నారు.

స్పీడ్ పెంచిన తరువాత ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడర్ పరిధిలో రోజుకు 5వేలకు పైగా ప్రయాణీకుల సంఖ్య అదనంగా పెరిగినట్లు మెట్రో ఉన్నతాధికారులు చెబుతున్నారు. అదే విధంగా కరోనా లాంటి వైరస్ ప్రభావం లేకుండా మెట్రో కోచ్‌లో ఓజోన్ ఆధారిత శానిటైజేషన్ చేపడుతుండటంతో మెట్రో ప్రయాణం సురక్షితమని నగరవాసులు అంటున్నారు. మూడు పోర్టబుల్ ఓజోకేర్ మొబిజోన్ యూనిట్లను కోచ్‌లను పరిశుభ్రం చేస్తున్నారు. గాలితో పాటు ఉపరితలాలను శానిటైజ్ చేయడానికి హాస్పటిల్స్, హెల్త్‌కేర్, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కోచ్ పరిశుభ్రం చేసేందుకు వీలుంటుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ఉగాది పండుగ తరువాత మూడు కారిడార్ల పరిదిలో రోజుకు 2. 10లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు.

ఉదయం 6గంటల నుంచి రాత్రి 11.15 గంటలవరకు చివరి స్టేషన్‌కు రైల్ చేరుకునేలా చేశామని, దీంతో చాలామంది ఉద్యోగులు సొంత వాహనాలపై వెళ్లకుండా మెట్రో పై వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. వర్క్ ప్రం హోమ్ ఐటీ సంస్దలు ఎత్తివేత్తివేయడంతో సాప్ట్‌వేర్ ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లుతున్నట్లు వెల్లడిస్తున్నారు. నూతన ఆఫర్లతో భవిష్యత్తులో మెట్రో స్టేషన్లు జనసందోహంగా మారుతాయని స్టేషన్ అధికారులు భావిస్తున్నారు. ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని, వచ్చే ఆరునెలల్లో మరి కొన్ని ఆఫర్లు తీసుకొస్తామని, ఇటీవల ప్రవేశపెట్టిన ఆఫర్లకు నగరవాసులు ఆదరిస్తున్నట్లు మెట్రో ఉన్నతాధికారులు త్వరలో నగర మెట్రోకు కరోనా కంటే ముందు ఏవిధంగా జనాదరణ ఉందో ఆ రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News