Wednesday, January 22, 2025

తెలంగాణ పల్లెల్లో మార్షల్ ఆర్ట్‌కు ఆదరణ

- Advertisement -
- Advertisement -

‘జాతీయ కరాటే కుంగ్ ఫూ పోటీ’ల పోస్టర్ ఆవిష్కరణలో శాట్స్ ఛైర్మన్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆత్మవిశ్వాసం, శారీరక సంతులనం ఇచ్చే మార్షల్ ఆర్ట్‌కు పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుందని తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. తనను తాను రక్షించుకోవడానికి అదే సమయంలో ఇతరులను రక్షించడానికి ఉపయోగపడే ఈ క్రీడలు ప్రతి విద్యార్థి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ముఖ్యంగా విద్యార్థినిలు,మహిళలు వర్కింగ్ ఉమెన్స్ కరాటే కుంగ్ ఫుల్లో తప్పనిసరి శిక్షణ తీసుకోవడం ఎంతో అవసరం ఉందన్నారు. మంగళవారం ఎల్‌బి స్టేడియంలోని తన కార్యాలయంలో ఇండియా షాటోకన్ కరాటే అండ్ కుంగ్ ఫూ అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9,10వ తేదీల్లో సరూర్ నగర్‌లో నిర్వహించబోయే జాతీయ కరాటే కుంగ్ ఫూ పోటీలకు చెందిన పోస్టర్‌ను ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్‌కు ప్రతి గ్రామంలో కరాటే కోచింగ్ సెంటర్లు విరివిగా నెలకొని ఆదరిస్తున్నారన్నారు. స్వీయ రక్షణ క్రమశిక్షణకు తోడ్పడే కరాటే కుంగ్ ఫూ లాంటి మార్షల్ ఆర్ట్‌కు తెలంగాణ పల్లెల్లో సైతం విపరీతమైన ఆదరాభిమానాలు ఉన్నాయని ఆయన గుర్తు చేస్తూ ప్రతి కళాశాలలో విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులలో ప్రాథమిక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇండియా షాటోకన్ కరాటే అండ్ కుంగ్ ఫూ అకాడమీ అధ్యక్షులు సి. రాజు, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ కృష్ణ గౌడ్, వి. నరేందర్ , ఎం . శ్రీరంగ, సిహెచ్ రవి,కే శేఖర్ రెడ్డి, ఎండి నవీద్, టీ .నగేష్ బి.గోపాల్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ మార్షల్ ఆర్ట్‌కు సినీ నటులు సుమన్, విశ్వక్ సేన్ ముఖ్యమైన ప్రమోటర్లుగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News