Sunday, January 19, 2025

భానుడి ప్రతాపం జనం విలవిల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ :నిండు వేసవి నిప్పులు కురిపిస్తోంది. రా ష్ట్రంలో అసాధారణ వాతవరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మాడు పగ లే ఎండలతో జనం విలవిలలాడుతున్నారు. దీనికి తోడు సెగలు చి మ్ము తున్న వడగాల్పులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. గత రెండు రో జు లుగా పెరుగుతున్న వడదెబ్బ మృతుల సంఖ్యే అందుకు అద్దం పడు తోం ది. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేసవిలో ఇప్పటి వరకూ వడదెబ్బతో 30మంది ప్రా ణాలు కోల్పోయినట్టు అధికారుల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గత రెం డు రోజుల్లోనే ఏకంగా 14మంది మృతిచెందినట్టు సమాచారం. రాష్ట్రం లో మంగళవారం నాడు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ సెగలు చిమ్ముతోంది. నల్లగొండ జిల్లా మాడుగుల పల్లిలో 46.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే విధమైన ఉష్ణోగ్రతుల నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా జైనాలో 46.2 డిగ్రీలు, అల్లీపురల 46.1డిగ్రీలు నమోదు అయ్యాయి.

కరీంనగర్ జిల్లా వీణ వంక, కొత్తగట్టు, జగిత్యాల జిల్లా కొల్వాయ్ కేంద్రాల్లో 46డిగ్రీలు రికార్డ యినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వెల్లడించింది. రాష్ట్రంలోని దుల్మిట్ట, వెల్గటూరు, నాంపల్లి, తెల్దేవరపలి తదితర అత్యధిక ప్రాంతాల్లో 45నుంచి 46డిగ్రీల ఉష్ణోగ్రతలు చోటు చేసుకున్నాయి.దక్షిణ , నైరుతి దిశల నుంచి కిందిస్థాయిలో గాలులు తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతునాయి. ఉదయం పది గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాల్పులు సుర్రుమంటున్నాయి. సాయంత్రం వరకూ వీటి తీవ్రత తగ్గటం లేదు. మరోవైపు ఉక్కపోత చెమటతో నిలువునా తడిపేస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య జనం విలవిల లాడిపోతున్నారు. మే నెల మొదటి వారంలో ఉష్ణోగ్రతల తీవ్రతతోపాటు వడగాల్పలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రానున్న ఐదు రో జుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే ఒకటిన నిర్మల్ ,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం , నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ ,మెదక్ కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ ,జోగులాంబగద్వాల జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత పెరగనుందని తెలిపింది.ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు కూడా మే 5వరకూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
42డిగ్రీలకు గ్రేటర్ హైదరాబాద్:
వాతావరణ కేంద్రం గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రత్యేక వాతావరణ సూచన చేసింది. రాగల 24గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు కనిష్టంగా 29నుంచి గరిష్టంగా 42డిగ్రీలకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల గాలులు గంటకు 4నుంచి 8కిమీటర్ల వేగంతో అగ్నేయ దిశగా వీచే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఆ తరువాత 48గంటలు కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వివరించింది. మంగళవారం గ్రేటర్ పరిధిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41.6డిగ్రీలు నమోదుకాగా, గాలిలో తేమ 041శాతం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News