Thursday, November 14, 2024

పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు ముందస్తు బెయిల్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా, నటీమణి షెర్లీన్‌చోప్రా, తదితరులకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోర్నోగ్రఫీ వీడియోలకు సంబంధించి పోలీసులు వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి కూడిన ద్విసభ్య రాజ్యాంగ ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ నిందితులు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. నిందితుల తరఫున వాదనలు విన్న తరువాత ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ద్విసభ్య బెంచ్ తెలిపింది.

ఈ కేసులో నిందితుల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ మాట్లాడుతూ.. నిందితులు సహకరించడంతో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని తెలిపారు. కాగా, ఇంతకుముందే సర్వోన్నత న్యాయస్థానం రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేసింది. నీలిచిత్రాల ఆరోపణలపై పోలీసులు రాజ్‌కుంద్రాపై కేసు నమోదు చేసిన పోలీసులు షెర్లిన్ చోప్రా, పూనం పాండేను సహ నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News