పోర్చుగల్: కరోనా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించిన ఆందోళన కలిగించే వార్తలు పోర్చుగల్ నుండి జోరుగా వినిపిస్తున్నాయి. ఫైబర్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పోర్చుగీస్ హెల్త్ వర్కర్ ఆకస్మికంగా చనిపోయింది. మృతురాలికి శవపరీక్ష ఇంకా చేయలేదని సమాచారం. సోనియా అసెవెడో (41)వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల తర్వాత ఆకస్మకంగా ప్రాణాలు కోల్పోయినట్టు ఆమె తండ్రి తెలిపాడు. అంతకుముందు ఆమెకు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేవని, అటు వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదన్నాడు. కూతురి మరణానికి కారణం ఏమిటో తనకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అటు పోర్చుగల్‌లోని 10 మిలియన్ల జనాభాతో 7,118 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 427,000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ కరోనా మొదటి వేవ్ చాలా తేలికగా ఉంది. కానీ ఆ తరువాత కేసులు వేగంగా పెరిగాయని అధికారులు వెల్లడించారు.
Portuguese Woman dies getting Pfizer vaccine