Friday, February 28, 2025

పోసానికి 14 రోజుల రిమాండ్… ’14 కేసులు ఉన్నట్టు ఆయనకే తెలియదు’

- Advertisement -
- Advertisement -

అన్నమయ్య: నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం తెల్లవారు జామున 2:30 గంటల వరకు  వాదనలు కొనసాగాయి. ఐదుగంటల పాటు ఇరుపక్షాల వాదనలు మెజిస్ట్రేట్‌ విన్నారు. ఇవాళ  ఉదయం 5:30 గంటలకు జడ్జి తీర్పు వెలువరించారు. మెజిస్ట్రేట్‌ మార్చి 13 వరకు రిమాండ్ విధించారు. వెంటనే
రాజంపేట సబ్‌జైలుకు పోసాని కృష్ణమురళిని పోలీసులు తరలించారు.

14 కేసులు ఉన్నట్టు పోసాని కృష్ణ మురళీకే తెలియదని ఆయన తరపు అడ్వొకేట్ పొన్నవోలు తలెిపారు.  పోసానిపై లైఫ్‌ పనిష్మెంట్‌ సెక్షన్‌ 111 పెట్టారని, 111 సెక్షన్‌ను కోర్టు కొట్టివేసిందన్నారు. ఐటి యాక్ట్‌ కూడా వర్తించదని కోర్టు చెప్పిందని వివరించారు. ఐదేళ్లలోపు శిక్షపడే సెక్షన్లకు రిమాండ్‌ విధించాల్సిన అవసరం లేదని పొన్నవోలు తెలిపారు.  సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిమాండ్‌కు పంపొద్దని కోర్టుకు విన్నవించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తాము వాదనలు చేశామని, కానీ మా వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్, చంద్రబాబును టార్గెట్ చేస్తూ పోసాని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అనేక కేసుల్లో చిక్కుకున్నారు. వాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మాట్లాడటంతోపాటు బూతులతో రెచ్చిపోయే వాడు. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లెలో నమోదు అయిన కేసు ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News