- Advertisement -
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఇటీవల నంది అవార్డులపై చేసిన వ్యాఖ్యలతో వివాదం రేపారు. ఈ అవార్డులను కమ్మ అవార్డులుగా ఆయన అభివర్ణించారు. తనకు గతంలో కమ్మ నంది అవార్డు వచ్చిందని, అయితే అది అక్కర్లేదని, దానిని తిరస్కరించేందుకు విలేకరుల సమావేశం కూడా నిర్వహించానని తెలిపారు. గతంలో గ్రూపుల వారీగా అవార్డులు పంపిణీ చేసేవారని, నంది అవార్డులకు ఎంపిక చేసిన కమిటీలోని 12 మందిలో 11 మంది కమ్మవాళ్లేనని పోసాని ఆరోపించారు.
ఎపి ఫైబర్‌నెట్ షో మొదటి రోజు సందర్భంగా పోసాని ఈ వ్యాఖ్యలు చేసారు. అతని వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో దృష్టిని ఆకర్షించాయి. ఇండస్ట్రీలో నంది అవార్డులకు ప్రత్యేక స్థానం ఉండగా.. వాటిని పంపిణీ చేయడం పట్ల పోసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్షపాతం, అభిమానం కారణంగా చాలా మంది దర్శకులు, నిర్మాతలు అవార్డులను కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -