Wednesday, January 22, 2025

పేదల ఉసురు తగిలి బాబు కుళ్లికుళ్లి చస్తారు: పోసాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: గతంలో చంద్రబాబు పాలనలో బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన విషయం గుర్తు లేదా? అని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ ప్రశ్నించారు. శుక్రవారం పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రైతుల ఆత్మహత్యలపై మాట్లాడారా? అని అడిగారు. చంద్రబాబు ఎలాంటి నీచపు పనులైనా చేయొచ్చా? అని నిలదీశారు. పేదల ఉసురు తగిలి చంద్రబాబు కుళ్లికుళ్లి చస్తారని శాపనార్థాలు పెట్టారు. రైతులను అడ్డం పెట్టుకొని ఇంత డ్రామా ఆడతారా?, అమరావతి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నానని, బాబు మాట వింటే అమరావతి రైతులు సర్వనాశనం అయిపోతారన్నారు.

Also Read: ఎస్‌ఐని కాల్చి చంపిన దుండగులు

సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలన బాగాలేదని నిరూపిస్తే చెప్పుతో కొట్టుకుంటానని పోసాని సవాల్ విసిరారు. జగన్ మంచి పనులు చేస్తుంటే టిడిపి నేతలకు ఏడుపు ఎందుకు వస్తుందని చురకలంటించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఒక బ్రోకర్ అని, ఎబిఎన్ సంస్థల అధినేత రాధాకృష్ణ సిగ్గులేని వ్యక్తి అని పోసాని మండిపడ్డారు. రాధాకృష్ణ వేల కోట్లు సంపాదించిన ఒక బ్రోకర్ అని దుయ్యబట్టారు. సిఎం జగన్‌పై పడి ఏడవడమే రామోజీ పని అని, పేపర్‌ను అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. సిఎం జగన్ ప్రజాన్యాయస్థానంలో 151సీట్లు గెలిచారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News